TG: హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో నిర్వహిచే క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. క్రిస్మస్ పండగ ప్రపంచంలో అత్యధిక మంది నిర్వహించుకునేదని పేర్కొన్నారు. పేదలకు విద్య, వైద్యాన్ని క్రైస్తవ మిషనరీలు అందిస్తున్నాయని, దళిత క్రిస్టియన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సంక్రాంతి తర్వాత ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వెల్లడించారు.