TG: బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు జరగనివ్వం. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతాం. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరాపార్క్ వద్ద భారీ సభను ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.