TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 7.8, మెదక్ జిల్లాలో 9.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల పొగమంచు కమ్ముకొంది.