AP: రాష్ట్రంలో రేపటి నుంచి ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామని, సేకరించిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. రైతులు 7337359375 నంబరుకు ‘HI’ అనే సందేశం పంపి తమ వివరాల్ని నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.