TG: లోక్‌సభలో అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షాపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. HYDకు చెందిన కార్తీక్ అనే న్యాయవాది రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. లోక్‌సభ సాక్షిగా డా. బీఆర్ అంబేద్కర్‌ను షా అవమానించారని లేఖలో తెలిపారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు.