ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నూతన అధ్యక్షుడు ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజాలో అమెరికన్లు బందీలుగా ఉన్న విషయాన్ని బైడెన్ ప్రస్తావించినట్లు యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సల్లివాన్ తెలిపారు. బందీల విడుదల ఒప్పందానికి సంసిద్ధులై ఉండాలని ట్రంప్ బృందానికి సూచించినట్లు చెప్పారు. బందీల కుటుంబ సభ్యులు ఇప్పటికే బైడెన్ను కలిసి వారిని సురక్షితంగా తీసుకురావాలని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.