AP: నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకురాలు పద్మ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం శ్రీరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకురాలు డిమాండ్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై క్షమాపణ కోరుతూ శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.