TG: పట్నం నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నరేందర్ని జైలులో కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల తిరుగుబాటును ప్రతిపక్షాల కుట్రగా ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. లగచర్లలో భూములు ఇవ్వబోమని పోరాటం చేసిన రైతులకు నరేందర్ రెడ్డి మద్దతిచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా BRS కుట్ర అంటున్నారు. అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.