TG: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ACP వెంకటగిరి.. లింగయ్యను విచారిస్తున్నారు. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు BRS నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. చిరుమర్తి లింగయ్య విచారణ అనంతరం మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.