విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కీలక ప్రాంతాలైన జగదాంబ జంక్షన్, మహారాణిపేట, రంగిరీజువీధి తదితర ప్రాంతాలను 22 ఏ నుంచి మినహాయించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. 100 ఏళ్లుగా లేని ఈ సమస్య గత ప్రభుత్వంలో ఏర్పడిందన్నారు. 22 ఏను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.