లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది. గతంలో అతడిపై నమోదైన ఎఫ్ఐఆర్లు మూసివేయాలన్న పోలీసు అభ్యర్థనకు దిగువ కోర్టు ఆమోదం తెలిపింది. కానీ దీనికి భిన్నంగా మద్రాస్ హైకోర్టు అతడిపై విచారణకు ఈడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇవాళ ఉదయం చెన్నై సహా పలు ప్రాంతాల్లోని అతడి ఆస్తులపై దాడులు చేపట్టింది. 2019 నుంచి తమిళనాడులో లాటరీ కింగ్‌గా పాపులర్ అయ్యాడు.