ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించినట్లు నూతన అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌస్‌లో జరిగిన భేటీలో బైడెన్ ఎక్కువసేపు మధ్యప్రాశ్చ్యం గురించే చర్చించినట్లు పేర్కొన్నారు. తాను బైడెన్ అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకొన్నట్లు తెలిపారు. కాగా, గాజాలో బంధించిన అమెరికన్లను విడుదల చేకపోతే.. తగిన మూల్యం చెల్లించక తప్పదని గతంలో ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.