AP: రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్నందున సరఫరా పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇసుక లభ్యతపై ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని అధికారులకు సూచించారు. రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాల్సిందిగా ఆదేశించారు.