మూడేళ్ల కాలంలో రూ.500 విలువైన నకిలీ నోట్ల వాడకం నాలుగు రెట్లు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2020-21 నుంచి ఇప్పటి వరకు 2000 విలువైన నకిలీ నోట్లు మూడు రెట్లు పెరిగినట్లు చెప్పింది. రూ.500 నకిలీ నోట్ల వాడకం రోజురోజుకూ పెరుగుతున్నట్లు వెల్లడించింది. 2018-19లో 2.1 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించగా.. 2022-23కి 9.1 కోట్ల నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు పేర్కొంది.