సింగపూర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ విజయం సాధించాడు. మూడో గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌పై గెలుపొందాడు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఫలితంగా 1.5-1.5 పాయింట్లతో లిరెన్‌ను సమం చేశాడు. తొలి గేమ్‌లో ఓడిపోయిన తర్వాత గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. అయితే, రెండో గేమ్ డ్రాగా ముగిసింది.