బొప్పాయి పండు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, ఆకులు, పండులోని విత్తనాలలో అనేక ఖనిజాలతోపాటు పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం పనిచేస్తాయి. బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకులను సాంప్రదాయ వైద్యంలో రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను రక్షించడం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయి.