వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో వివాదాస్పద ‘వక్ఫ్ సవరణ బిల్లు’ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ‘వక్ఫ్’ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నిన్న సమావేశమైంది. గడువును పొడిగించాలని కోరుతూ జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు తీర్మానం చేసిన ప్రతులను లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు పంపినట్లు సమాచారం.