TG: రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డిలోని న్యాల్కల్ 9.4, గుమ్మడిదల 9.5, మెదక్ జిల్లాలోని శివ్వంపేటలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఆదిలాబాద్ 9.7, సిద్దిపేట జిల్లాలోని కొండపాక 10.6, రామగుండం 13.8, హన్మకొండ 14, పటాన్చెరు 11 రాజేంద్రనగర్ 13, హయత్నగర్లో 13.8 డిగ్రీలు నమోదైంది. చలి కారణంగా ఉదయం పూట బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.