TG: నారాయణపేట జిల్లా మాగనూరు ZPHSలో ఆహారం కలుషితమైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పాఠశాలను విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి సందర్శించారు. ఇక నుంచి ప్రతిరోజూ ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థులతో కూడిన ఆహార కమిటీ సభ్యులు తిన్న తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.