అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. 725 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించనున్నారట. ఈ మేరకు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు స్పీడ్‌గా చేస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది జనవరిలో బైడెన్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.