సాధారణంగా చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. వాటినుంచి బయటపడేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సల్ఫర్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. క్యాబేజీ, బచ్చలికూర, సిట్రస్ ఫ్రూట్స్, టమాటా వంటివి తినాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించాలి. నొప్పి ఉన్నచోట వేడి కాపడం పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకోవటం మంచిది.