మహిళ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏంటి? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’ యేనా.? మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అన్న ఈ కేసు బ్రిటన్ సుప్రీంకోర్టుకు చేరింది. స్కాట్లాండ్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో.. చాలా మంది లింగ మార్పిడి చేసుకుని.. ఈ రిజర్వేషన్లు పొందుతున్నారు. దీన్ని అక్కడి మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై బ్రిటన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.