ప్రకాశం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు పద్మచరణ్ శెట్టి(34) ఉరి వేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చీమకుర్తిపట్టణంలోని రామ్‌నగర్‌లో భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురై అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.