ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో CEO దీపిందర్ గోయల్ కీలక ప్రకటన చేశారు. మరో రెండేళ్లు (2026 మార్చి 31 వరకు) జీతం తీసుకోనని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ డాక్యుమెంట్లలో వెల్లడించారు. ఆయితే, 2021 నుంచి మూడేళ్లు జీతం తీసుకోలేదు. దీన్ని మరో రెండేళ్లు పెంచారు. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు గోయల్ జీతం తీసుకోకుండా ఉంటారు. కాగా, ఆయన జీతం వదులుకున్నా.. కంపెనీలో భారీ వాటా ఉంది.