హిమాలయాల్లోని యుద్ధక్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్ లోయను సందర్శించే అవకాశం కల్పించింది. ఈ మేరకు పర్యటకులను అనుమతించనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. టూర్ ఆపరేట్లరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.