AP: పెండింగ్లో ఉన్న ఉద్యోగ నియామకాల భర్తీకి APPSC ఛైర్పర్సన్ అనురాధ దృష్టి సారించారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా గత ప్రభుత్వంలో విడుదల చేసిన 19 నోటిఫికేషన్ల నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. క్రమంగా వాటన్నింటినీ పూర్తి చేసేందుకు APPSC ముమ్మరం చేసింది. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష తేదీలు నిర్ణయించారు. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ సహా మిగిలిన నియామకాల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.