TG: హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్జోన్లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. HMDA పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జూలైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ HMDA కమిషనర్ విచారణకు హాజరై ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు.