TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సమగ్ర ఇంటింటి సర్వే 95 శాతం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఈ సర్వేలో మొత్తం 1,18,02,726 ఇండ్లను గుర్తించారు. ఇప్పటివరకు 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తయిందన్నారు. కేవలం 7,04,366 నివాసాల సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు. సేకరించిన డేటాను కంప్యూటర్లలో పొందుపరుస్తున్నామని తెలిపారు.