భారత్-చైనా అంతర్జాతీయ సరిహద్దులో ఎల్ఏసీ వెంబడి అరుణాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాలను కలుపుతూ 1,637 కి.మీ ఫ్రాంటియర్ హైవే నిర్మాణానికి కేంద్రం రూ.28,229 కోట్లు మంజూరు చేసింది. రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు అరుణాచల్‌లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి, సరిహద్దు రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ప్రాజెక్ట్ హెడ్ చంద్ర లూనియా తెలిపారు. 2027 నాటికి పనులు పూర్తవుతాయన్నారు.