TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు. కాగా, భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని.. మన్మోహన్ సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.