అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపపడుతున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు అర్ధరాత్రి ట్వీట్ చేసిన ఆమె.. వారికి అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. వారిని బాధపెట్టాలని తాను మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. కాగా ఆమెపై నాగార్జున వేసిన పరువునష్టం కేసు కోర్టు విచారణలో ఉంది.