TG: అసెంబ్లీలో పలు ఆంక్షలు విధించారు. మాజీ ప్రజాప్రతినిధులను ఇన్నర్ లాబీలోకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు అనుమతి లేదంటూ అసెంబ్లీ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీయొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.