VZM: నెల్లిమర్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయి 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్, వాలీబాల్ పోటీల్లో సత్తా చాటారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగిన పోటీల్లో ఈ పాఠశాల, కళాశాల విద్యార్థులు సిహెచ్ హారిక, వై యామిని, ఎం దాక్షాయని ప్రతిభ కనబరిచారు. త్వరలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ అభినందించారు.