NTR: జగ్గయ్యపేటలోని డంపింగ్ యార్డ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై రాజు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.