TG: 50శాతం వడ్లు దళారుల పాలయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్ల మీద చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. యాసంగి పంట ప్రారంభానికి ముందే రైతులందరికీ ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చాక భూముల విలువలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. భూముల రేట్లు తగ్గాయని తెలిపారు.