TG: మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం సురవరం పనిచేశారన్నారు. ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. మరోవైపు ఆయన మృతిపట్ల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, MLC కవిత సంతాపం ప్రకటించారు.