AP: గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి అనిత అధ్యక్షతన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈగల్’ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు చేతులమీదుగా ‘ఈగల్ 1972’ టోల్ ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.