గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 69 మంది మృతిచెందినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. దాడులు జరిగిన ప్రదేశాల్లో పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, సిరియాలోని రష్యా నౌకాదళ స్థావరం ఉన్న టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. దాడి సమయంలో 3.0 తీవ్రతతో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధ డిపోలు ధ్వంసం చేసినట్లు సమాచారం.