TG: క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారన్నారు. వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.