ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియర్ కానుంది.