టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఎంగేజ్ మెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్యతో ఈ నిశ్చితార్థం అయింది.
Brahmanandam:టాలీవుడ్ టాప్ కమెడియన్(Comedian) బ్రహ్మానందం(Brahmanandam) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్(Siddharth) ఎంగేజ్ మెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజ(Dr. Padmaja) వినయ్ కూతురు ఐశ్వర్యతో ఈ నిశ్చితార్థం అయింది. బ్రహ్మానందం కొడుకు సిద్ధార్థ్ కాబోయే భార్య కూడా ఒక డాక్టరే.. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్నాయి.
హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు ఇందులో ఒకరు గౌతమ్(Gautham).. అతడు హీరోగా కొన్ని చిత్రాల్లో నటించారు. కాగా అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని కుటుంబంతో చాలా ఆనందంగా ఉన్నారు. అయితే బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ విదేశాలలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తుండడంతో అతని గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సిద్ధార్థ్ కు సినిమాల పైన పెద్దగా ఆసక్తిలేవకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇక బ్రహ్మానందం కుమారుడు సిద్ధార్థ్-ఐశ్వర్య వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ వివాహాన్ని బ్రహ్మానందం చాలా వైభవంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది.బ్రహ్మానందం సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో పెద్దగా నటించలేదు. చివరిగా రంగమార్తాండ సినిమాలో నటించారు. కొన్ని ఆరోగ్య కారణాలవల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.