రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో గవర్నర్ గుర్మీత్ సింగ్, సీఎం పుష్కర్ ధామి రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఆమె అక్కడ పర్యటించనున్నారు. నేడు హరిద్వార్‌లోని పతంజలి యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.