TG: సీఎం రేవంత్ చేతకాని పాలనకు నిదర్శనం పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అని మాజీమంత్రి KTR విమర్శించారు. ‘కార్యకర్తలతో మాట్లాడిన ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్‌లు ఎన్నో చూశాం. ఎంత అణచివేయాలని చూస్తే అంత పోరాటం చేస్తాం. నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నా’ అని అన్నారు.