AP: సీఎం చంద్రబాబు హయాంలోనే యురేనియం తవ్వకాలకు జీవో ఇచ్చారని ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి అన్నారు. యురేనియం అంశంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలతో వాతావరణం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే యురేనియం జీవో రద్దు చేయాలని సూచించారు.