ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్కు బానిసలు అవుతున్నారు. దీని నుంచి బయటపడకపోతే ఇదొక వ్యసనంగా మారి పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుందట. పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల వారి క్రియేటివిటీ, ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక టీనేజీ పిల్లలు ఫోన్ అతిగా వాడితే మెదడు పనితీరు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, కుంగుబాటుకు గురవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.