TG: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం బోసిపోయింది. నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ ప్రజలంతా సొంతూళ్లకు వెళ్లడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా దర్శనిస్తున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం నిలిపివేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.