Allu Arjun guest role in ‘Jawaan’!? : షారుఖ్ ‘జవాన్’లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్!?
Allu Arjun guest role in 'Jawaan'!? : షారుఖ్ 'జవాన్'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్!? : ఒకప్పుడు బాలీవుడ్ అంటే.. టాలీవుడ్‌కి అందని ద్రాక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి, ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు.
ఒకప్పుడు బాలీవుడ్ అంటే.. టాలీవుడ్‌కి అందని ద్రాక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి, ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. బాహుబలి సినిమా ఇండియన్ సినిమా ఫార్మాట్‌నే మర్చేసింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. అవి కూడా టాలీవుడ్ నుంచే ఎక్కువగా రాబోతున్నాయి. అందుకే బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గెస్ట్‌గా మారబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా పఠాన్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు షారుఖ్ ఖాన్. ఇదే జోష్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఇళయదళపతి విజయ్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాడని సమాచారం. జవాన్‌లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బన్నీని సంప్రదించాడట అట్లీ. పాత్ర నచ్చడంతో అల్లు అర్జున్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత వచ్చే బ్రేక్‌లో ‘జవాన్’ కోసం డేట్స్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల మాట. జవాన్ జూన్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. బాలీవుడ్ బాద్షాకే బన్నీ గెస్ట్‌గా మారడం విశేషం.