TG: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న లగచర్లను ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ పేరుతో లంకలా మార్చేశారని ఫైర్ అయ్యారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారనే ఆ గిరిజన రైతులు తిరగబడ్డారని పేర్కొన్నారు. కానీ, అధికారులపై దాడి చేయడం వారి అభిమతం కాదన్నారు. BRS ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కొనసాగిస్తుందో లేదో చెప్పాలన్నారు.