AP: CMను చంపుతానంటూ ఓ వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేయడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. మంగళగిరి రత్నాలచెరువు ప్రాంతం నుంచి ఇసునూరి వెంకట నాగేశ్వరరావు (45) అనే వ్యక్తి 100కు ఫోన్ చేసి.. తాను సీఎంను గంటలో చంపుతానంటూ బెదిరించాడు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన మద్యం మత్తులో ఫోన్ చేశాడట.