ఎక్కువ టూత్ పెస్ట్ పెట్టుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పేస్టు అధికంగా వాడితే.. రోగాల బారిన పడుతారని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఉపయోగిస్తే దంతాలపై క్యావిటీస్ ఏర్పడుతాయి. పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.